డ‌బుల్ రోల్‌లో క‌నిపించ‌నున్న హీరో నాని..?

హీరో నాని మంచి ఫామ్‌లో ఉన్నాడు. లాక్‌డౌన్ వ‌ల్ల ఆయ‌న సినిమాలకు బ్రేక్ వ‌చ్చింది కానీ లేదంటే ఇప్ప‌టికే మ‌రో రెండు మూడు సినిమాల‌ను లైన్‌లో పెట్టేశాడు. లాక్‌డౌన్ ఉన్న‌ప్ప‌టికీ ఓటీటీలో వీ సినిమాను రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రో మూడు సినిమాల‌ను లైన్‌లో పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం ట‌క్ జ‌గ‌దీష్ సినిమాలో బిజీగా ఉన్నాడు నాని. ఈ సినిమా కంప్లీట్ అవ్వ‌గానే రాహుల్ సంక్రిత్యాన్ డైరెక్ష‌న్‌లో శ్యామ్ సింగ‌రాయ సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమాలోనే నాని రెండు పాత్ర‌ల్లో క‌నిపిస్తార‌ని టాక్ న‌డుస్తోంది. ఓ పాత్ర 1960లో కనిపిస్తే, మరో పాత్ర ప్రెజెంట్‌ జనరేషన్‌లో కనిపిస్తుందట. కోల్‌కత్తా, హైదరాబాద్‌లలో సాగే పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయిపల్లవి, క్రితిశెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

ఈ సినిమా త‌ర్వాత కూడా నాని‌ వివేక్‌ ఆత్రేయ డైరెక్ష‌న్‌లో సినిమా చేయ‌నున్నాడు. ఇవి కాకుండా మ‌రో రెండు మూడు సినిమాలు ఆయ‌న ప్లాన్ చేస్తున్నార‌ని ఇండ‌స్ట్రీలో టాక్ న‌డుస్తోంది. లాక్‌డౌన్ వ‌ల్ల ఏమాత్రం న‌ష్టం లేకుండా ఇప్పుడు వ‌రుస సినిమాలు చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నారంట‌. ఇదే నిజ‌మైతే నాని ఫ్యాన్స్‌కి పండ‌గే అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here