త‌రుణ్‌, ప్రియ‌మ‌ణి ల‌వ్ రూమ‌ర్స్‌పై క్లారిటీ..

హీరో త‌రుణ్‌, ప్రియ‌మ‌ణి క‌లిసి న‌టించిన చిత్రం న‌వ వ‌సంతం. ఈ సినిమా 2007లో విడుద‌లై మంచి పేరు సంపాదించుకున్న విష‌యం తెలిసిందే. అయితే అప్ప‌ట్లో త‌రుణ్ ప్రియ‌మ‌ణి ఇద్ద‌రూ ప్రేమించుకొని పెళ్లి చేసుకోబోతున్నార‌ని బాగా ప్ర‌చారం న‌డిచింది. తాజాగా ప్రియ‌మ‌ణి దీనిపై స్పందించింది.

అయితే సినిమా షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ప్రియ‌మ‌ణిని త‌రుణ్ వాళ్ల అమ్మ క‌లిశారు. అప్పుడు బ‌య‌ట జ‌రుగుతున్న చ‌ర్చ గురించి ఆమె వివ‌రించారు. నిజంగా త‌రుణ్‌తో ప్రేమ ఉంటే ధైర్యంగా చెప్పాల‌ని.. ఇద్ద‌రికీ పెళ్లి చేయ‌డానికి త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని చెప్పిన‌ట్లు ప్రియ‌మ‌ని అన్నారు. ఏ విష‌యం ఉన్నా ఓపెన్‌గా చెప్పాల‌ని కోరారంట‌. అయితే ఈ విష‌యం విన్న ప్రియ‌మ‌ణి షాక్‌కు గురైన‌ట్లు చెప్పారు. ఎందుకంటే సెట్‌లో షూటింగ్ చేయ‌డం తప్ప బ‌య‌ట ఎవ్వ‌రు ఏమ‌నుకుంటున్నారో తెలియద‌ని ప్రియ‌మ‌ణి అన్నారు. దాదాపు ప‌ద‌మూడేళ్ల విష‌యం గురించి ప్రియ‌మ‌ణి ఇప్పుడు ప్ర‌స్తావించ‌డంతో ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే ఇవ‌న్నీ అవాస్త‌వాల‌ని ప్రియ‌మ‌ణి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here