చీర కట్టులో ‘కుమారి’.. !

‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ హెబ్బా పటేల్. ఈ సినిమా విజయంలో హెబ్బా కీలక పాత్ర పోషించిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమా తర్వాత హెబ్బాకు పలు అవకాశాలు వచ్చినా.. ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేదు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా హెబ్బా పెద్దగా సినిమాల్లో కనిపించట్లేదు. ప్రస్తుతం ఈ చిన్నది ‘ఒరేయ్ బుజ్జిగా’ అనే సినిమాలో నటిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా హెబ్బా పటేల్ ఫోటో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోలో చీరకట్టులో ఆకట్టుకుంటోంది. అయితే సన్నగా ఉన్న హెబ్బా పటేల్ కాస్త బొద్దుగా మారినట్లు కనిపిస్తోంది. తన తర్వాత సినిమా కోసం హెబ్బా ఇలా మారిందా..? లేదా లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉండటంతో లావుగా మారిందా తెలియదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here