చంద్ర‌బాబు టీంలో మ‌రో వికెట్‌..

ఏపీలో వై.ఎస్ జ‌గ‌న్ పాల‌న‌ను చూసి ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లే ఆశ్చ‌ర్య‌పోతున్నారు. రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్న‌ప్ప‌టికీ సంక్షేమ ప‌థ‌కాల‌లో రారాజుగా ఆయ‌న పాల‌న అందిస్తున్నారు. దీంతో ఇప్పటికే ప‌లువురు టిడిపి ఎమ్మెల్యేలు వైసీపీకి గూటికి చేర‌గా.. తాజాగా మ‌రో ఎమ్మెల్యే వై.ఎస్ జ‌గ‌న్ టీంలోకి వెళ్లారు.

విశాఖ‌ప‌ట్నం ద‌క్షిణ ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌ని క‌లిశారు. ఇటీవ‌ల ఏపీ ప్ర‌భుత్వం విశాఖ‌ను కార్య‌నిర్వాహ‌క రాజ‌ధానిగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ ప్రాంత వాసులంతా సంతోషంలో ముగినిపోయారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం మూడు రాజ‌ధానుల‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ వ‌స్తోంది. ఈ ప‌రిస్థితుల్లో విశాఖ‌లో మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించాల‌న్న పార్టీ వ్యాఖ్య‌లు ఎమ్మెల్యేల‌కు న‌చ్చ‌డం లేదు. దీంతో ఎమ్మెల్యే గ‌ణేష్ టిడిపిపై అసంతృప్తితో ఉన్నారు.

ఈ ప్రాంత ఎమ్మెల్యేలు విశాఖ అభివృద్ధికి కృషి చేస్తున్న వై.ఎస్ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. దీంతో ఈ రోజు జ‌గ‌న్‌ను క‌లిసిన వాసుప‌ల్లి గ‌ణేష్‌.. త‌న ఇద్ద‌రు కుమారుల‌ను వైసీపీలో జాయిన్ చేశారు. సీఎం జ‌గ‌న్ వీరికి కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్ప‌టికే గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ, గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యే ముద్దాలి గిరిలు సీఎంను క‌లిశారు. ఆ త‌ర్వాత  ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం కూడా జ‌గ‌న్ క‌లిశారు. వీరంతా జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు ఇస్తూ వ‌స్తున్నారు. తాజాగా వీరి టీంలో వాసుప‌ల్లి గ‌ణేష్ చేరిపోయారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో  టిడిపి ఏం చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here