మ‌హారాష్ట్రలో బీజేపీ ఏం చేస్తుందో ఈయ‌న వివ‌రంగా చెప్పారు..

భార‌త‌దేశ రాజ‌కీయాలు ఎప్పుడూ ఆస‌క్తిగానే ఉంటాయి. బీజేపీ శివ‌సేన రెండు మంచి మిత్ర‌ప‌క్షాలుగానే ఉండేవి. అయితే కొన్ని రోజుల క్రితం ఈ రెండు పార్టీల‌కు ఏమాత్రం ప‌డ‌టం లేదు. దీంతో ఇప్పుడు భ‌ద్ర శ‌త్రువుల‌లాగ వ్య‌వ‌హారిస్తున్నాయి.

తాజాగా బీజేపీపై శివ‌సేన ప‌లు వ్యాఖ్య‌లు చేసింది. మహారాష్ట్రపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడి రాజకీయాల గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసునని శివసేన పేర్కొంది. కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తూ, ఒత్తిళ్ళకు పాల్పడుతోందని ఆరోపించింది. ఇటువంటి ఒత్తిళ్ళకు శివసేన భయపడబోదని స్పష్టం చేసింది. శివసేన నేత సంజయ్ రౌత్ శనివారం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం విన్యాసాలు చేస్తూ, ఒత్తిడి రాజకీయాలకు ప్రయత్నిస్తోందని, అయితే ఇటువంటివి మహారాష్ట్రలో ప్రభావం చూపవని చెప్పారు.

కేంద్ర సంస్థల కదలికలను తాము మౌనంగా గమనిస్తున్నామన్నారు. తాము భయపడబోమన్నారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ఎల్లప్పుడూ ఒత్తిడి రాజకీయాలు ఉంటాయన్నారు. తాము పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఒత్తిడి రాజకీయాలు చేయాలనుకునేవారికి స్వాగతం పలుకుతామన్నారు. కేంద్ర సంస్థలను ఉపయోగించి ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఈస్టిండియా కంపెనీతో పోల్చారు. ఈస్టిండియా కంపెనీ కూడా ఇటువంటి వ్యూహాలను అమలు చేసేదన్నారు. వ్యక్తులను కొనడం, అణగదొక్కడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉండేదన్నారు. సీబీఐ, ఈడీలను కుక్కలుగా చూపుతూ ప్రచురించిన కార్టూన్‌ను తాను షేర్ చేయడాన్ని సమర్థించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here