విమానంలోప‌లికి వెళ్ల‌కుండా రెక్క‌పైకి ఎక్కాడు..

మామూలుగా ఎవ‌రైనా విమానం లోప‌లికి వెళ్ల‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఒక‌వేళ ఫోటోలు దిగాలంటే విమానం బ‌య‌ట నిల‌బ‌డి దిగుతారు. కానీ ఓ వ్య‌క్తి విమానం రెక్క‌పైకి ఎక్కాడు. అంట‌తితో ఆగ‌కుండా అటూ ఇటూ ఊగిపోయాడు. దీంతో ఒక్క‌సారిగా అంద‌రూ షాక్ అయ్యారు. సెక్కూరిటీ అల‌ర్ట్ అయ్యారు.

అమెరికాలో ఓ వ్యక్తి విమానం రెక్క ఎక్కి రచ్చచేశాడు. లాస్‌వేగాస్‌ నగరంలోని మెక్‌కారన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకా్‌ఫకు సిద్ధంగా ఉంది. ఆ సమయంలో ఎక్కడి నుంచో ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఆ విమానం రెక్కపై కనిపించాడు. రెక్కపై కాసేపు అటూఇటూ ఊగాడు. ఈలోగా అధికారులకు సమాచారం అందడంతో ఆ వ్యక్తిని వారు అదుపులోకి తీసుకోవడానికి వచ్చారు. కొంతమంది అధికారులు విమానం రెక్క ఎక్కి అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా అతడు అదుపుతప్పి కింద పడ్డాడు.

అనంతరం ఆ వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను ఓ మహిళ వీడియో తీసి తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. అయితే ఆ వ్యక్తిని మానసిక రోగిగా భావిస్తున్నారు. అయితే దీనిపై ప‌లువురు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఎవ్వ‌రికి క‌నిపించ‌కుండా రెక్క‌ల‌పైకి వెళ్లే వ‌ర‌కు సిబ్బంది ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మొద‌ట్లోనే ఇత‌న్ని గుర్తించాల‌ని క‌దా అంటున్నారు. ప్ర‌యాణీకుల భ‌ద్ర‌త విష‌యంలో అన్ని విధాలా జాగ్రత్త‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here