హ‌థ్ర‌స్ బాదితురాలిని ఆమె త‌ల్లితండ్రులే చంపారా..? ప్ర‌ధాన నిందితుడు ఏమ‌న్నాడు..

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ హ‌థ్ర‌స్ ఘ‌ట‌న‌లో కీల‌క ఆరోప‌ణ‌లు బయ‌టకు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఈ కేసులో ఉన్న నిందితులకు అనుకూలంగా ప‌లువురు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. కాగా నేడు నిందితుల్లో ప్ర‌ధాన వ్య‌క్తి పోలీసుల‌కు ఓ లేఖ రాశారు. దీంట్లో విస్తుపోయే విష‌యాలు వెల్ల‌డించారు.

హ‌థ్ర‌స్ బాధితురాలిని ఆమె తల్లిదండ్రులే హింసించి చంపారని పోలీసులకు రాసిన లేఖలో ప్రధాన నిందితుడు పేర్కొన్నాడు. అంత‌టితో ఆగ‌కుండా మ‌రో ముగ్గురు నిందితుల‌తో క‌లిసి బాదితురాల‌కి న్యాయం చేయాల‌ని కోరుతున్న‌ట్లు చెప్పారు. బాదితురాలి త‌ల్లి, సోద‌రుడు ఆమెను బాగా హింసించార‌ని లేఖ‌లో పేర్కొన్న‌ట్లు తెలుస్తోంది. నిందితుడు ఇలా పేర్కొన‌డంతో కేసు ఏ మ‌లుపు తీసుకుంటుందో అన్న అనుమానాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

హ‌థ్ర‌స్ ప్ర‌ధాన నిందితుడైన సందీప్ ఠాకూర్ జైల్లో ఉన్నాడు. అక్క‌డి నుంచి ఆయ‌న ఓ లేఖ రాశారు.. అందులే ఏమ‌ని ఉందంటే.. దారుణం జరిగిన రోజు, బాధితురాలిని కలుసుకోవడానికి నేను వెళ్లాను. అక్కడ ఆమె తల్లి, సోదరుడు కూడా ఉన్నారు. నన్ను అక్కడి నుంచి వెళ్లమని బాధితురాలు చెప్తే ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాను. మా స్నేహంపై కోపంతో ఉన్న ఆమె సోదరుడు, తల్లి నేను ఊర్లోకి వెళ్లిన అనంతరం.. ఆమెను విపరీతంగా కొట్టడం ప్రారంభించారు. నేను ఆమెను కనీస మాత్రం కొట్టలేదు. ఆమె తల్లి, సోదరుడు నాపై, మరో ముగ్గురిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మేమంతా అమాయకులం. కానీ, తప్పుడు ఆరోపణల వల్ల జైళ్లో ఉన్నాం. సరైన దర్యాప్తు చేసి మాకు న్యాయం అందించండి. అని లేఖ‌లో ఉంది. ఈ లేఖ‌లో ఉన్న దాన్ని బ‌ట్టి చూస్తే ఈ కేసు ఎలా మ‌లుపు తిరుగుతుందో అన్నది ఆస‌క్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here