మరో ఛాలెంజింగ్‌ పాత్రలో సమంత..!

అక్కినేని సమంత.. ఇప్పుడీ పేరు ఓ బ్రాండ్‌గా మారింది. కేవలం సినిమాలతోనే కాకుండా వ్యాపారంలోనూ తనదైన ముద్ర వేస్తోందీ అక్కినేని వారి కోడలు. వివాహాం తర్వాత సినిమాల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్న ఈ చిన్నది నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తోంది. రంగస్థలంలో డీ గ్లామర్‌ పాత్రలో నటించి మెప్పించిన సమంత ఇప్పుడు మరో ఛాలెంజింగ్‌ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

ఈ ముద్దుగుమ్మ ఇటీవలే అశ్విన్‌ శరవన్‌ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పింది. ఈ చిత్రంలో సమంత మూగ అమ్మాయిగా నటించనుందని సమాచారం. సమంత ఈ సినిమా కోస నవంబర్‌ నుంచి డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. మరి ఈ పాత్రతో సమంత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక ఇదిలా ఉంటే సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మెన్ 2’ త్వరలోనే అమేజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here