డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ కి అనుమతి ఇచ్చిన పవన్ కళ్యాణ్

అజ్ఞాతవాసి సినిమా చేస్తున్న సమయంలో పవన్ కల్యాణ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే తర్వాత అజ్ఞాతవాసి సినిమా విడుదలై పరాజయం పాలవడంతో పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పరిమితమయ్యాడు….ఈ క్రమంలో సినిమాలకు దూరమయ్యాడు. ఇదిలావుండగా డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ పవన్తో సినిమా చేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయాడు. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనని స్పష్టం చేశారట.
దీంతో సంతోష్ శ్రీనివాస్ పవన్ కల్యాణ్ చెప్పిన కథ తో వేరే హీరోతో సినిమా చేయడానికి సిద్ధమైపోయాడు. అయితే ఈ క్రమంలో గతంలో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో  చేద్దామని అడ్వాన్స్ తీసుకున్న పవన్ కళ్యాణ్ తిరిగి ఆ అడ్వాన్సు ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో జనసేన పార్టీ పెట్టి నాలుగు సంవత్సరాలు ముగించుకొని ఐదవ సంవత్సరం లో అడుగుపెడుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాలో భారీ మహాసభను ఏర్పాటు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here