సమంత నాగచైతన్య రెమ్యూనరేషన్

పెళ్లి చేసుకున్న తర్వాత నాగచైతన్య సమంత కలిసి ఓ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాని హీరోగా నిన్ను కోరి సినిమా తీసిన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య సమంత వారి చేతుల్లో ఉన్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో నాగచైతన్య 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు అలాగే సమంత రంగస్థలం సినిమా షూటింగ్ ముగించుకుని మహానటి సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది.
సాధారణంగా ఒక సినిమాకి చైతూ 3 కోట్లకి పైగా తీసుకుంటాడు. ఇక సమంత ఒకటిన్నర వరకూ తీసుకుంటుంది. అయితే వివాహం తరువాత చైతూ .. సమంతల కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. ఆడియన్స్ లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ క్రేజ్ కి తగినట్టుగా ఇద్దరికీ కలిపి 7 కోట్ల వరకూ పారితోషికం ఇవ్వమని చైతూ అడిగినట్టుగా టాక్. ఇంత మొత్తానికి ఇవ్వడానికి రెడీ అయిపోయారు నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది. వైవిధ్యమైన ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిస్తారట దర్శకుడు శివ నిర్వాణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here