కెసిఆర్ ని మెచ్చుకున్న పవన్ కళ్యాణ్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయం లో చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రత్యేక హోదా ఇవాల్సిన కేంద్రంపై రాష్ట్ర రాజకీయ పార్టీలను ఊసిగోలుపుతూ అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రకటించడం జరిగింది. అయితే ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక హోదా విషయమై ఆదివారం సంచలన కరమైన ప్రకటనలు చేశారు.
ప్రత్యేక హోదా ఇస్తే ఇవ్వండి లేకపోతే ఇవ్వలేమని తెగేసి చెప్పాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని .. ప్రత్యేక హోదా కోసం ముందుకెళ్తున్న ప్రతి ఒక్కరికీ ఇవి కొండంత నైతిక బలం ఇచ్చిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చెప్పారు. ఆదివారం జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఈ అంశంపై మాట్లాడాల్సిన అవసరం లేకపోయినప్పటికీ సాటి తెలుగువారిగా స్పందించి మద్దతు తెలిపినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగువారు ఎక్కడున్నా ఒకటే అనడానికి ఆయన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. వాళ్లు రైల్వే జోన్‌ గురించి మాట్లాడితే తాము బయ్యారం ఉక్కు కర్మాగారానికి మద్దతిస్తామని చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం కూడా బంగారు తెలంగాణ అవ్వాలని ఆకాంక్షించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here