తన సినిమా బాలేదు అంటే ప్రేక్షకులనే తిట్టిన హరీష్ శంకర్ ?

దువ్వాడ జగన్నాథం సినిమా థాంక్స్ మీట్ అట్టహాసంగా సాగింది. హరీష్ శంకర్ ఈ ప్రోగ్రాం లో సినీ విమర్శకుల మీద గట్టిగా మాట్లాడుతూ వారిని విమర్శించారు. వారి మీద తాము సాధించిన విజయం గా ఈ సినిమా గొప్పతనం చెప్పారు హరీష్. దాదాపు పావుగంట మాట్లాడిన హరీష్ శంకర్ పది నిమిషాలు తనని ఎవరైతే విమర్శించారో వారి మీదనే మాట్లాడారు. విమర్శకుల మెప్పు పొందని సినిమాలు ఇదివరకు కూడా చాలా పెద్ద హిట్ లు అయినా క్రిటిక్స్ మీద ఇంతగా ఎవ్వరూ విరిచుకుని పడలేదు. ఎవరి అభిప్రాయం వారిది , ఎవరి రివ్యూ వారిది అన్నట్టు గౌరవించిన డైరెక్టర్ లు ఉన్నారు కానీ ఇలా హరీష్ లాగా అన్నిటినీ హార్ట్ కి తీసుకున్నవాళ్లు చాలా తక్కువ.

యూట్యూబ్ ఓపెన్ చేస్తే పబ్లిక్ టాక్ లో జనం సైతం రాడ్డః రాడ్డస్య రాద్దోభ్యః అంటూ ఈ సినిమా గురించి కామెడీ చేసారు మరి వారిని కూడా హరీష అన్నట్టే గా .. అంటే సామాన్య ప్రేక్షకుడిని కూడా తన సినిమా బాలేదు అన్నాడు అని హరీష్ ఫైర్ అవుతున్నాడా ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here