వైకాపా జనం గురించి మాట్లాడమంటే టీడీపీ కంగారు..

కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీఎస్టీ బిల్లు ఏపీ శాసనసభ లో ఆమోదం పొందింది. ఒక పక్క వైకాపా నుంచి నినాదాలు వస్తూ ఉండగానే దీన్ని ప్రవేశ పెట్టడం ఆమోదం చేసుకోవడం జరిగింది. ఈ బిల్లును ఆర్థిక మంత్రి యనమల సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చ కొనసాగింది. చివరగా సీఎం చంద్రబాబు దీనిపై మాట్లాడారు.

అనంతరం, బిల్లును ఆమోదించాల్సిందిగా స్పీకర్ ను యనమల కోరారు. వెంటనే బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ బిల్లు పాస్ అయ్యేలా చెయ్యడం లో ముఖ్య పాత్ర పోషించినందుకు గాను బీజేపీ ఎమ్మెల్యే విష్ణు రాజు కుమార్ ఆయనకి ధన్యవాదాలు తెలిపారు. వైకాపా ముందర ప్రజా సమస్యల గురించి మాట్లాడి ఈ బిల్లు జనానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది చూసుకుని ఆ తరవాత పాస్ చేయాలి అని కోరగా అధికార పక్షం వినిపించుకోలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here