జ‌గ‌న్ ఇలా చేస్తాడ‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు సంచ‌ల‌నాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలో వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చి సీఎం జ‌గ‌న్ నిజంగా సంచ‌ల‌న‌మే సృష్టించారు. యావ‌త్ దేశాన్ని ఆక‌ర్షిస్తోన్న వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ఆయ‌న మ‌రోసారి పొడ‌గించారు.

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న అంటే ముందుగా గుర్తొచ్చే పేరు వాలంటీర్‌. ఎందుకంటే క్షేత్ర స్థాయి నుంచి ప్ర‌తి ఒక్క పౌరుడికి వాలంటీర్ల సేవ‌లు అందుతున్నాయి. ఇలా వాలంటీరే దగ్గ‌రుండి చూసుకుంటున్నాడు. సీఎం జ‌గ‌న్ ఏ ఉద్దేశంతో అయిన వాలంటీర్ల వ్య‌వ‌స్థ ప్రారంభించారో.. దాన్ని మించిన స్పంద‌న వీరిపై వ‌స్తోంది. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌కు సంబంధించిన ఏ విష‌య‌మైన ఇప్పుడు ప్ర‌జ‌లు వాలంటీర్‌ను మాత్ర‌మే అడుగుతున్నారంటే అతిశ‌యోక్తి కాదు.

2019 ఆగ‌ష్టు 15వ తేదీన వాలంటీర్ల వ్య‌వ‌స్థ ఏర్పాటైంది. ఏడాది కాలంలో వాలంటీర్లు సాధించిన విజ‌యాలు అన్నీ ఇన్నీ కాదు. 1వ తేదీ రాగానే పించ‌న్ల పంపిణీలో ఉన్న వాలంటీర్లు ప్ర‌భుత్వానికి గుడ్ నేమ్ తీసుకొచ్చింది ఇక్క‌డే. ఇక క‌రోనా లాంటి కీల‌క స‌మ‌యంలో వాలంటీర్ సేవ‌లు అమోఘ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఏ ఒక్క‌రూ బ‌య‌ట‌కు రాకుండా ఉన్న లాక్‌డౌన్‌లో వాలంటీర్ ఇంటింటికి తిరిగి నిర్వ‌ర్తించిన విధుల ప‌ట్ల సీఎం నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. సీఎం జ‌గ‌న్ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్య‌వ‌స్థను ఇత‌ర రాష్ట్రాలు కూడా కాపీ కొట్టేలా ఇక్క‌డ ప‌నితీరు ఉంది.

ప్ర‌స్తుతం మ‌రో ఏడాది పాటు వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భుత్వం పొడ‌గించింది. 2021 ఆగ‌ష్టు 15 వ‌ర‌కు వాలంటీర్ల వ్య‌వ‌స్థ పొడ‌గిస్తూ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. దీంతోవాలంటీర్లు కూడా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ప‌ని చేసే వారికి గుర్తింపు ద‌క్కుతుంద‌ని వారు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here