బెంగుళూరు పోలీసుల‌కు గుడ్ న్యూస్‌..

విధినిర్వ‌హ‌ణ‌లో పోలీసులు ఎంత‌లా క‌ష్ట‌పడుతుంటారో మ‌న‌కు తెలిసిందే. ఎండ‌, వాన లెక్క చెయ్య‌కుండా ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు విధుల్లోనే ఉంటారు. ఇలాంటి ప‌రిస్థితులు ఉన్న నేప‌థ్యంలో బెంగుళూరు పోలీసుల‌కు గుడ్ న్యూస్ వ‌చ్చింద‌ని చెప్పొచ్చు.

బెంగళూరు పోలీసులకు అన్ని సౌకర్యాలతో కూడిన ఏడు పోర్టబుల్ క్యాబిన్లు సమకూరాయి. ఈ క్యాబిన్లలో మీటింగ్ ఏరియా, ఫోర్ బంకర్ బెడ్స్, వాష్‌రూమ్ మొదలైవాటిని సమకూర్చి, పట్టణంలోని ప్రధాన ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ క్యాబిన్లను బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్(బీఐఏఎల్) సమకూర్చింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలీటీ(సీఎస్ఆర్)లో భాగంగా వీటిని అందించినట్లు బీఐఏఎల్ అధికారులు తెలిపారు.

ఈ క్యాబిన్లు బెంగళూరు పోలీసులకు వాతావరణం నుంచి రక్షణ కల్పిస్తాయని, అలాగే, కీలక సమయాల్లో సమావేశాలకు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. ఈ క్యాబిన్లలో ఎల్ఈడీ బల్బులు, సీలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేశామన్నారు. వీటికితోడు 300 లీటర్ల కెపాసిటీ కలిగిన ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్, కిచెన్ సౌకర్యాలు కల్పించామన్నారు. దీనికి ముందు బెంగళూరు ఎయిర్‌పోర్టు… కర్నాటక స్టేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (కేఎస్ఆర్టీసీ) భాగస్వామ్యంతో ప్రయాణికుల కోసం మూడు ఇండియన్, నాలుగు వెస్ట్రన్ టాయిలెట్లను ఏర్పాటు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here