పిల్ల‌ల్ని క‌నండి 3వేల డాల‌ర్లు పొందండి..

పిల్ల‌ల్ని క‌న‌కుండా వాయిదా వేసుకోవాల‌నుకుంటున్న వారికి సింగ‌పూర్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మామూలుగా సింగ‌పూర్‌లో జ‌నాభా త‌క్కువ‌గా ఉంటుంది. అందుకే అక్క‌డి ప్ర‌భుత్వం పిల్ల‌ల్ని క‌నాల‌ని ఆఫ‌ర్లు కూడా ప్ర‌క‌టిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మ‌రో కొత్త ఆఫ‌ర్ ఇవ్వ‌నుంది.

క‌రోనా కార‌ణంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేప‌థ్యంలో చాలా మంది పిల్ల‌ల్ని క‌న‌డం వాయిదా వేసుకున్నారు. దీంతో సింగ‌పూర్ ప్ర‌భుత్వం ఆందోళ‌న‌లో ప‌డింది. జ‌నాభాను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధికి ఆటంకం క‌లిగే అవ‌కాశం ఉంద‌ని భావించింది. దీంతో కొత్త‌గా పిల్ల‌ల్ని క‌నేవారికి బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది.

పిల్ల‌ల్ని క‌నేవారికి 3 వేల సింగ‌పూర్ డాల‌ర్ల ఇవ్వ‌నుంది. ఈమేర‌కు అక్క‌డి ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేర‌కు ది బేబీ స‌పోర్టు గ్రాంట్ అనే ఓ కొత్త ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. దీని కింద ఈ ఏడాది అక్టోబ‌రు 1వ తేదీ నుంచి 2022 సెప్టెంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు సంతానం పొందేవారికి ప్రోత్సాహ‌క న‌గ‌దు అందుతుంద‌ని పేర్కొంది. అయితే గ‌తంలో కూడా సింగ‌పూర్ ప్ర‌భుత్వం ఓ ప‌థ‌కం తెచ్చింది. బేబి బోన‌స్ క్యాష్ గిఫ్టు ప‌థ‌కం పేరుతో గిఫ్టు కూప‌న్లు ఇచ్చి ప‌దివేల సింగ‌పూర్ డాల‌ర్లు ఇచ్చింది.

ఇప్పుడు మ‌రోసారి జ‌నాభా సంక్ష‌భం త‌లెత్త‌డంతో ఈ ప‌థ‌కం తీసుకొచ్చింది. కాగా పొరుగుదేశాల్లో జ‌నాభా త‌గ్గించుకునేందుకు ప్రభుత్వాలు తంటాలు ప‌డుతున్నాయి. అయితే సింగ‌పూర్‌లో కొంద‌రు లాక్‌డౌన్ ఉన్నా పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే పిల్ల‌ల్ని క‌నేందుకు మాత్రం ఆస‌క్తి చూప‌డం లేదు. ఇందుకు కార‌ణం రాబోయే పిల్ల‌ల్ని పోషించేందుకు స‌రైన ఆర్థిక స్తోమ‌త లేక‌పోవ‌డమే. ఈ విష‌యం సింగ‌పూర్ ప్ర‌భుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో వెంట‌నే రంగంలోకి దిగిన ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు సిద్ధ‌మైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here