హీరో రవితేజ కి ఎసరు పెడుతున్న రాజశేఖర్

రాజశేఖర్ హీరోగా థియేటర్స్ కి వచ్చిన ‘గరుడ వేగ’ .. విడుదల రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. రెండవ రోజు నుంచే ఈ సినిమా వసూళ్లు పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్ల పరంగా అదే జోరును కొనసాగిస్తోంది. 5 రోజుల్లోనే 15 కోట్లను వసూలు చేసిన ఈ సినిమా, ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది.
 ఓవర్సీస్ లోని కొన్ని ప్రాంతాల్లో స్క్రీన్స్ పెంచడం ఓ విశేషమైతే, అక్కడ ‘రాజుగారి గది 2’ .. ‘ఉన్నది ఒకటే జిందగీ’ వసూళ్లను ఈ సినిమా అధిగమించడం మరో విశేషం. ప్రస్తుతం అక్కడ ఈ సినిమా, ‘రాజా ది గ్రేట్’ వసూళ్లకు దగ్గరలో వుంది. ఈ వసూళ్లను కూడా ‘గరుడ వేగ’ క్రాస్ చేసే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది. చాలా గ్యాప్ తరువాత రాజశేఖర్ చేసిన ‘గరుడ వేగ’ .. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దూసుపోతుండటం పట్ల ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here