ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో పవన్ తో ఎందుకు విడిపోయారు అని అడిగితే రేణూ ఇలా చెప్పింది

మౌనం పరమ శీలమని ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ వ్యాఖ్యానించారు. ఒక టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, తాను విడాకులు తీసుకుని ఏడేళ్లు పూర్తైందని, ఇప్పుడు దాని గురించి మాట్లాడడం సరికాదని అన్నారు. కెరీర్ ఆరంభంలో బుద్ధిగా చదువుకునే తాను మోడల్ ఎలా అయ్యానా? అని భావించేదానినని చెప్పారు. అలాగే మోడలింగ్ కేరీర్ ఆరంభించిన మొదట్లో తనపై తనకు నమ్మకం వుండేది కాదని అన్నారు. అంతేకాదు, అబ్బాయిలెవరూ తనను చూడటం లేదు, అసలు మోడల్ ను ఎలా అయ్యాను? అని ఆశ్చర్యపోయేదానినని ఆమె చెప్పారు.
కారణమేంటో తెలియదు కానీ, మోడలింగ్ లో తనకు ఎవరూ ప్రపోజ్ చేయలేదని ఆమె అన్నారు. ‘బద్రి’ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కల్యాణ్ ను చూడగానే పడిపోయానని ఆమె అన్నారు. దానినే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారని ఆమె చెప్పారు. తమది సంప్రదాయ కుటుంబమైనా అంతా ఆయనే చూసుకుంటారని భావించి, తాను సహజీవనానికి అంగీకరించానని తెలిపారు. విడాకులు ఎందుకు తీసుకున్నానో ఇప్పుడు చెప్పనని, ముసలిదానినైపోయిన తరువాత ఆటోబయోగ్రఫీలో రాస్తానని ఆమె చెప్పారు. తామిద్దరం ఇప్పటికీ మంచి స్నేహితుల్లా ఉంటామని ఆమె అన్నారు. ఈ ఎపిసోడ్ ఆదివారం టెలీకాస్ట్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here