ఐదుగురు పిల్ల‌ల్ని భ‌వ‌నంపై నుంచి తోసేసింది..

చిన్న‌పిల్ల‌లు క‌నిపిస్తే ఎవ‌రైనా ముద్దుగా మాట్లాడిస్తారు. లేదంటే చూసి సంబ‌ర ప‌డిపోతారు. కానీ ఓ మ‌హిళ ఐదురుగు పిల్ల‌ల్ని ఏమాత్రం క‌నిక‌రం లేకుండా భ‌వ‌నంపై నుంచి కింద‌కు తోసేసింది. ఈ హృద‌య విదార‌క ఘ‌ట‌న జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

రాంచీలో ఓ మ‌హిళ ఐదుగురు పిల్ల‌ల్ని భ‌వ‌నంపై నుంచి కింద‌కు విసిరేసింది. సాహెబ్‌గంజ్ ప‌ట్ట‌ణంలో ఆదివారం సాయంత్రం 7 గంట‌లకు ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. బిహారీ లాల్ మండల్ భవన్ లో 10 మంది పిల్లలు టీవీ చూస్తుండగా ఈ ఘటన జరిగింది. పిల్లల్ని టెర్రస్ పైకి తీసుకువెళ్లి ఒక్కొక్కరిని కిందకు విసిరేసింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. పిల్లల్ని కాపాడేందుకు ప్రయత్నించిన బుధన్ మండల్ కు కూడా గాయాలయ్యాయి.పిల్లల్ని భవనం పైనుంచి విసిరేసిన మహిళకు గత కొంతకాలంగా మతిస్థిమితం లేదని పోలీసులు చెప్పారు.

బాధితుల కుటుంబాలు మహిళపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఈ ఘటనలో నిందితురాలైన మహిళను సదర్ పోలీసుస్టేషనుకు పిలిపించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘ‌ట‌న‌లో బాదితులు ఫిర్యాదు చేయ‌కుండా ఉన్నందుకు ప‌లువురు మండిప‌డుతున్నారు. జ‌ర‌గ‌రానిది జ‌రిగితే బాధ్య‌త ఎవ‌రు తీసుకుంటార‌ని అడుగుతున్నారు. ఇలాంటివి మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా ఉండాలంటే మ‌తిస్థిమితం లేని వాళ్ల‌ను తీసుకెళ్లి హాస్పిట‌ల్‌లో వ‌దిలేయాల‌ని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here