అన్న‌పూర్ణ స్టూడియోలో అగ్నిప్ర‌మాదం.. బిగ్‌బాస్ కార్య‌క్ర‌మం ప‌రిస్థితి ఏంటి.. ?

హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. దీంతో వెంట‌నే అక్క‌డున్న సిబ్బంది అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ప్ర‌స్తుతం స్టూడియోలో పోలీసులు ఉన్నారు. ఫైర్ ఎలా అయ్యింద‌న్న దానిపై విచార‌ణ చేస్తున్నారు.

అన్న‌పూర్ణ స్టూడియోలో ఫైర్ అన్న మాట విన‌గానే అంతా ఒక్క‌సారిగా ఆందోళ‌న‌కు గుర‌య్యారు. అయితే షూటింగ్ కోసం వేసిన ఓ సెట్‌లో షార్ట్ స‌ర్కూట్ కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు భావిస్తున్నారు. అయితే భారీగా పొగ‌లు బ‌య‌ట‌కు రావ‌డం భ‌యాందోళ‌న‌కు గురిచేసింది. దీంతో వెంట‌నే తేరుకున్న సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు కూడా సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు.

కాగా ఈ అన్న‌పూర్ణ స్టూడియోలోనే బిగ్ బాస్ 4 కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. దీంతో బిగ్ బాస్ కంటెస్టెంట్ల‌కు ఏమైనా అయ్యిందా అన్న భ‌యం నెల‌కొంది. కానీ ఇప్పుడు ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతానికి బిగ్‌బాస్ సెట్‌కు సంబంధం లేద‌ని తెలుస్తోంది. ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతానికి కుడి వైపున బిగ్‌బాస్ సెట్ ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే అగ్నిమాపక సిబ్బంది సత్వరమే స్పందించి మంటల్ని ఆర్పివేయడంతో యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది. ఈ ప్ర‌మాదంతో ఆస్తి న‌ష్టం కూడా అంత భారీగా జ‌ర‌గ‌లేద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం దీనిపై పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here