పునర్నవి మనసు దోచినవాడు ఇతడే..!

ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ప్రేక్షకులను పరిచయమై బిగ్‌బాస్‌తో క్రేజ్‌ సంపాదించుకుంది నటి పునర్నవి నిన్న సోషల్‌ మీడియాలో ఎంగెంజ్‌ మెంట్‌ రింగ్‌ చూపిస్తూ పోస్ట్‌ చేసిన ఫొటో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ‘రింగు తొడుగుతున్న వ్యక్తి చేయి.. మహిళదేనని, పునర్నవి ఏదో సినిమా కోసం చేస్తోన్న ప్రచారమంటూ’ ప్రచారం జరిగింది.

అయితే తాజాగా ఆ వార్తలన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ.. పునర్నవి తనకు కాబోయే వాడిని ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే ఇక్కడ కూడా పునర్నవి దోబూచులాడడం మాత్రం మానలేదు. కాబోయే వాడి ఫొటోను బ్లర్‌ చేస్తూ అతనెవరో గుర్తుపట్టకుండా పోస్ట్‌ చేసి మరోసారి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించిందీ చిన్నది.

 

అయితే పునర్నవి పెళ్లాడే వ్యక్తి పేరు ఉద్భవ్‌ రఘనందన్‌. ఉద్భవ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించాడు. పునర్నవితో దిగిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ..‘చివరికి తను అంగీకరించింది. శుక్రవారం మా జీవితంలో చాలా గొప్ప రోజుని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను’ అని క్యాప్షన్‌ జోడించాడు. ఇక రఘునందన్‌ కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడం విశేషం. ఇతను నటుడే కాకుండా రచయిత అని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here