‘రియా’ బయోపిక్ తెరకెక్కనుందా..? 

యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం బాలీవుడ్ లో ఎంతటి సంచలనలకు తెరతీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. విచారణలో భాగంగా సుశాంత్  ప్రియురాలు రియా డ్రగ్స్ కు సంబంధించి తెలిపిన పలు వివరాల ఆధారంగా  కేసు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో( ఎన్సీబీ ) అధికారుల చేతికి వెళ్లిన విషయం తెలిసిందే. రియా విచారణలో చెప్పిన అంశాల ఆధారంగా ఎన్సీబీ అధికారులు రియాను అరెస్ట్ చేశారు. ఆమె జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 6 వరకు పొడిగించారు.

ఇదంతా ఇలా ఉంటే తాజాగా రియా చక్రవర్తిపై త్వరలో బయోపిక్ తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కొంతమంది దర్శకనిర్మాతలు రియా జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నారట. రియా చక్రవర్తిపై ఒక డాక్యుమెంటరీ రూపొందించడంతో పాటు ఓ పుస్తకాన్ని కూడా సిద్ధం చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. రియా జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలను ఈ చిత్రంలో చూపించనున్నారని సమాచారం. మరి ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు.. దర్శకత్వ బాధ్యతను ఎవరు తీసుకుంటారో వేచి చూడాలి.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here