సమ్మర్ కానుకగా విడుదలకానున్న  ‘ఎఫ్3’..

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కినఎఫ్2′ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమా బాక్సాఫీస్ వద్ద నవ్వులు పూయించడంతో పాటు, కాసుల వర్షం కురిపించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు. కరోనా కారణంగా వాయిదా పడ్డ షూటింగ్ తిరిగి నవంబర్ నుంచి ప్రారంభంకానుంది. సినిమా చిత్రీకరణను త్వరిగతిన పూర్తిచేసి సమ్మర్ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక వెంకీఎఫ్3′తో పాటునారప్పసినిమాలో కూడా  నటిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న సినిమాను తమిళంలో వచ్చినఅసురన్కు రీమేక్ గా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. చిత్రంలో వెంకీ సరసన ప్రియమణి నటించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here