చిరు బ‌ర్త్‌డేకి అంతా సిద్ధం అంటున్న చరణ్

మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే స్పెష‌ల్ రెడీ అయ్యింద‌ని రామ్ చ‌ర‌ణ్ ప్ర‌క‌టించేశారు. ఆగ‌ష్టు 22 కోసం ఎదురుచూస్తున్నామ‌ని ఆయ‌న ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు.

చిరంజీవి బ‌ర్త్‌డేకి ఆయ‌న కొత్త సినిమాకు సంబంధించిన ఏదో ఒక విశేషం బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని అంతా అనుకున్నారు. అభిమానుల ఊహ‌లు, ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్టే చిరు పుట్టిన‌రోజు సందర్బంగా ఆచార్య మూవీ ఫ‌స్ట్ లుక్‌ను, మోష‌న్‌ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేయ‌నున్నారు. ఆచార్య సినిమాకు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ది తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ప్ర‌భాస్ త‌న మూవీ ఆదిపురుష్‌కు సంబంధించి నిన్న సాయంత్రం మాట్లాడారు. రేపు ఉద‌యం స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్న‌ట్లు చెప్పారు. ఇప్పుడు అదే త‌ర‌హాలో రామ్ చ‌ర‌ణ్ కూడా 22 ఆగ‌ష్టు సాయంత్రం 4 గంట‌ల‌కు క‌లుసుకుందామ‌ని ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. దీన్ని బ‌ట్టి చూస్తే ఇప్ప‌టికే అన్ని సిద్ధం చేసుకొని ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు ఫ‌స్ట్‌లుక్ ఎలా ఉండ‌బోతోందో అన్న అంచ‌నాల్లో మునిగిపోయారు. ఈ ఏడాది చిరంజీవి త‌న 65వ పుట్టిన‌రోజును జ‌రుపుకోనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here