బాహుబలి లాగా రోజుకి ఐదు షో లు , డబల్ రేట్ టికెట్ లు .. డీజే రచ్చ మామూలుగా లేదు…

బాహుబలి 2 తరవాత ఇప్పటి వరకూ తెలుగు సినిమాల్లో పెద్ద చిత్రం ఏదీ రాలేదు. బుసినెస్ వర్గాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్దంగా ఉన్న టైం లో దువ్వాడ జగన్నాథం అంటూ అల్లూ అర్జున్ రంగం లోకి దిగ బోతున్నాడు. డీజే కి ఓపెనింగ్ లు అదిరిపోతాయి అనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఈ సినిమాని బయ్యర్లు ఎక్కువ రేట్ కి కొనేసారు, అక్కడ నుంచి థర్డ్ పార్టీ ల వాళ్ళకీ ఎగ్జిబిటర్ లకీ ఇంకా ఎక్కువ రేటు కి అమ్మేసారు. సో ఇదంతా రికవర్ అవ్వాలి అంటే మొదటి వరం డబల్ రేట్ కి సినిమా అమ్మాల్సిందే అంటున్నారు.

మొదటి వారం రోజు కి ఐదు షో లు పర్మిషన్ తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మాతలు. ఇకపైన వచ్చే భారీ సినిమాలు అన్నిటికీ ఇదే కాన్సెప్ట్ ఫాలో అయ్యేలా ప్లాన్స్ జరుగుతున్నయట. దిల్ రాజు ఆధ్వర్యం లో పెద్ద ప్రొడ్యూసర్ లు అందరూ ఇలాంటి ఛాన్స్ ఎక్కడైనా ఉందా అని ప్రభుత్వ పెద్దలతో డిస్కషన్ మొదలెట్టారు అని టాక్ మరి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here