తెలుగు సినిమాలో బ్రహ్మానందం రేంజ్ ని ఇప్పటి వరకూ ఎవ్వరూ చేరుకోలేకపోయారు. అడపా దడపా పృథ్వీ రాజ్ పర్లేదు అనిపించినా ఎక్కువకాలం అదే స్పూఫ్ కామెడీ నడవడం లేదు. బ్రాహ్మీ బాబాయ్ జోరు పూర్తిగా తగ్గిపోయిన తరవాత పృధ్వీ, సప్తగిరి, షకలక శంకర్ తదితరులు కమెడియన్లుగా బిజీ అయ్యారు కానీ వీళ్లంతా సీజనల్ కమెడియన్లే తప్ప సినిమాని విజయం దిశగా మోసే సత్తా వీరికి లేదని తేలిపోయింది. ప్రతీ సినిమా లోనూ బ్రాహ్మీ లాగా సినేఅమ మొత్తాన్నీ లాగడం అంటే ఈ కాలం కమీడియన్ లలో వెన్నెల కిషోర్ కి మాత్రమె సాధ్యం అంటున్నారు విశ్లేషకులు.
ఇచ్చిన ప్రతీ పాత్ర కీ అతను న్యాయం చేస్తూ ఇరగ దీస్తున్నాడు. ఈ మధ్యన వచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం , కేశవ లలో తన కామిడీ తో కుమ్మేసిన ఈ కుర్రాడు అమీ తుమీ చిత్రం తో అయితే పూర్తిగా తన నటన తో ఆకట్టుకున్నాడు. సినిమా మొత్తం తానే హీరోగా నడిపించాడు అనే చెప్పాలి. వెన్నెల కిషోర్ కామెడీ లేకపోయి వుంటే ఈ చిత్రం ఫ్లాట్ అయిపోయేదని విమర్శకులు ముక్తకంఠంతో ఇది వెన్నెల వారి సినిమా అనే అనేస్తున్నారు.