ఐదు కోట్లు బడ్జెట్ లేని రాజశేఖర్ సినిమాకి పాతిక కోట్ల బడ్జెట్ .. ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి ?

హీరో రాజశేఖర్ కొత్త సినిమా గరుడ వేగ మీద హైప్ లేకపోయినా పరవాలేదు అనిపించే ఆసక్తి కనబరుస్తున్నారు జనాలు. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకి డైరెక్షన్ చెయ్యడం ప్రోమో లు కూడా కొత్తగా ఉండడం తో ఒకింత ఆసక్తి గానే ఉన్నారు అందరూ. ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ మెప్పించి సినిమా మీద ఇంట్రెస్ట్ రేకెత్తించింది. కానీ ఈ సినిమాకి పాతిక కోట్ల బడ్జెట్ అంటేనే గుండె ఝల్లు మంటోంది. నిర్మాత కోటేశ్వర్ రాజు ఈ విషయం చెప్పగానే అందరూ నవ్వుకున్నారు కూడా. రాజశేఖర్ కు రూ.5 కోట్ల మార్కెట్ కూడా లేని నేపథ్యంలో రూ.25 కోట్లు ఎలా ఖర్చు పెట్టేస్తారు అని కామెడీ చేశారు.

కానీ మనకి అందుతున్న సమచారం ప్రకారం నిజంగానే ఈ సినిమాకి భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నారు అని తెలుస్తోంది. వంద రోజులుగా షూటింగ్ జరుపుతున్న ఈ సినిమా జార్జియా వెళ్లి మరీ ముప్పై మూడు రోజులు షూటింగ్ చేసారు. దీనికోసం యూనిట్ నుంచి బోలెడు మంది అక్కడికి వెళ్లారట. యాక్షన్ ఎపిసోడ్ లూ ఆ హా ఓహో అనే సెట్స్ తో సినిమా అదురుతుంది అంటున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here