మొన్న ముంబై.. నేడు హైద‌రాబాద్‌

డ్ర‌గ్స్ మాఫియా ఆగ‌డాల‌కు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. విచ్చ‌ల‌విడిగా డ్ర‌గ్స్ అమ్మేందుకు అక్ర‌మార్కులు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. మొన్న ముంబైలో డ్ర‌గ్స్ ప‌ట్టుకొని ప‌ట్టుమని ప‌ది రోజులు కాక‌ముందే నేడు హైద‌రాబాద్‌లో డ్ర‌గ్స్ మాఫియా ప‌ట్టుబ‌డింది.

250 కేజీల మ‌త్తుమందు ఏపిడ్రున్‌, కేట‌మైన్‌, మేపిడ్రీన్‌ను హైద‌రాబాద్‌లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వంద కోట్ల విలువైన వీటిని డి.ఆర్‌.ఐ అధికారులు ప‌ట్టుకున్నారు. ఈ డ్రగ్స్‌ను హైద‌రాబాద్ నుంచి ముంబై తీసుకెళ్తుండ‌గా ప‌ట్టుకున్నారు. అయితే ప‌ట్టుబ‌డిన వారిలో గ‌తంలో అరెస్టైన వారే ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు.

కాగా మొన్న  ముంబైలో 191 కేజీల డ్ర‌గ్స్‌ను అధికారులు ప‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. వీటి విలువ వెయ్యి కోట్ల ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. నేడు హైద‌రాబాద్‌లో ప‌ట్టుకున్న డ్ర‌గ్స్ విలువ వంద కోట్లు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. రూ. 50 కోట్లు విలువ చేసే రా మెటీరియ‌ల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. సిటీలోని ఓ ఫార్మా కంపెనీలో వీటిని త‌యారుచేస్తున్నార‌ని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here