అచ్చెన్నాయుడు త‌ర‌లింపు

ఈఎస్ఐ కుంభ‌కోణంలో అరెస్టై ఆసుప‌త్రిలో ఉన్న మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడును పోలీసులు ఎన్‌.ఆర్‌.ఐ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఈమేర‌కు కోర్టు ప‌ర్మిష‌న్‌తో ఈ చ‌ర్య‌లు తీసుకోనున్నారు.

జూన్ 13న అచ్చెన్నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. అయితే కోర్టు అనుమ‌తితో ఆయ‌న అనారోగ్య కార‌ణాల వ‌ల్ల గుంటూరులోని  ర‌మేష్ హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇటీవ‌ల వైద్యులు ఆయ‌న‌కు క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా పాజిటివ్ అని తేలింది.

అచ్చెన్నాయుడు త‌రుపున లాయ‌ర్ల సూచ‌న‌తో హైకోర్టు ఈయ‌న్ను ఎన్‌.ఆర్‌.ఐ ఆస్ప‌త్రికి త‌రలించి, ప్ర‌త్యేక గ‌దిలో చికిత్స అందించాల‌ని ఆదేశించింది. ఈఎస్ఐ హాస్పిట‌ల్స్లో టెలి మెడిసిన్‌, మందుల కొనుగోళ్ల అక్ర‌మాల కేసులో అచ్చెన్నాయుడు అరెస్టైన విష‌యం తెలిసిందే. రూ. 150 కోట్లు ప‌క్క‌దారి పట్టాయ‌న్న ఈ కేసులో అచ్చెన్న‌తో పాటు ప‌లువురు అధికారులు సైతం రిమాండ్‌లో ఉన్నారు.

అచ్చెన్నాయుడికి ఆప‌రేష‌న్ చేసి దాదాపు రెండు నెల‌ల‌వుతోంది. దీంతో ఇంత‌కీ అచ్చెన్నాయుడు హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అవుతారా లేదా అన్న సందేహాలు పొలిటిక‌ల్‌గా వ‌చ్చాయి. ఇంకెన్నాళ్లు ఆయ‌న హాస్పిట‌ల్‌లో ఉంటార‌ని అనుకుంటున్న తరుణంలో ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేప‌థ్యంలో కోవిడ్ నెగిటివ్ వ‌చ్చే వ‌ర‌కు అచ్చెన్నాయుడు హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here