బీర్ తాగి రూ.2 ల‌క్ష‌లు టిప్ ఎందుకు ఇచ్చాడో తెలుసా..

హోట‌ళ్లు, రెస్టారెంట్లు ఎక్క‌డ‌కు వెళ్లినా చివ‌ర‌కు వ‌చ్చేట‌ప్పుడు కొంత టిప్ ఇవ్వ‌డం ఇప్పుడు స‌ర్వ‌సాధార‌ణం. అదే స్టార్ హోట‌ల్ అయితే ఇంకొంచెం ఎక్కువ‌గా టిప్ ఇస్తాం. అయితే ల‌క్ష‌ల రూపాయ‌లు టిప్ ఇవ్వ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. దీని ఉద్దేశం ఏంట‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

అమెరికాలో ఇదే జ‌రిగింది. క్లీవ్ లాండ్ రెస్టారెంట్‌కి వ‌చ్చిన ఓ క‌స్ట‌మ‌ర్ రూ. 2 ల‌క్ష‌లు టిప్‌గా ఇచ్చారు. దీంతో ఆ సిబ్బంది ఒక్క సారిగా షాక్‌కు గుర‌య్యారు. అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉదృతి ఎక్కువ‌గా ఉంది. దీంతో అక్క‌డి ప్ర‌భుత్వం ప‌లు ఆంక్ష‌లు విధిస్తోంది. ఈ నేప‌థ్యంలో క్లీవ్‌లాండ్‌లోని నైట్‌టౌన్ రెస్టారెంట్ యాజమాన్యం కొద్ది రోజులుపాటు రెస్టారెంట్‌ను మూసేయనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఆదివారం రోజు రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ కస్టమర్ 7.02 డాలర్ల ( సుమారు రూ.500)తో బిర్‌ను కోనుగోలు చేశాడు. అనంతరం 3వేల డాలర్ల (దాదాపు రూ.2లక్షల)ను టిప్‌గా అక్కడ వదిలేసి వెళ్లాడు.

ఈ విషయాన్ని రెస్టారెంట్ ఓనర్ బ్రెండన్ రింగ్ తన ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. మొదటగా సదరు కస్టమర్ 3వేల డాలర్లను పొరపాటున అక్కడ విడిచి వెళ్లారని భావించి.. అతణ్ని వెనక్కి పిలిచినట్లు చెప్పారు. అయితే ఆ మొత్తాన్ని టిప్‌గా ఇచ్చినట్లు ఆ కస్టమర్ స్పష్టం చేశాడని బ్రెండన్ రింగ్ పేర్కొన్నారు. రెస్టారెంట్ తిరిగి ప్రారంభమైన తర్వాత మళ్లీ వస్తానని కూడా సదరు కస్టమర్ చెప్పారని బ్రెండన్ రింగ్ తెలిపారు. అంతేకాకుండా భారీ మొత్తాన్ని టిప్‌గా ఇచ్చిన ఆ కస్టమర్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు ఈ విష‌యం వైర‌ల్‌గా మారింది. అయితే అంత ఎక్కువ అమౌంట్ టిప్‌గా ఇవ్వ‌డం మామూలు విష‌యం కాదు క‌దా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here