కొత్త వైర‌స్ గురించి భ‌య‌ప‌డ‌కండి.. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌..

కొత్త స్ట్రెయిన్ వైరస్ విజృంభిస్తోంది. బ్రిట‌న్‌లో ఈ వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉంది. దీంతో అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇప్పుడిప్పుడే క‌రోనా నుంచి ఇంకా కోలుకోని ప్ర‌జ‌లు.. ఈ కొత్త ర‌కం వైర‌స్‌తో భ‌యాందోళ‌న చెందుతున్నారు. బ్రిట‌న్ వైర‌స్‌పై ప్ర‌పంచ దేశాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి. ఇండియాలో కూడా కేంద్ర ప్ర‌భుత్వం దీనిపై స్పందించింది.

బ్రిట‌న్‌లో కరోనా వైర‌స్ బాగా విజృంభించింది. అయితే దాని నుంచి పూర్తిగా బ‌య‌ట‌కు రాక‌ముందే ఇప్పుడు కొత్త‌గా మ‌రో వైర‌స్ రావ‌డంతో ప్ర‌జ‌ల‌కు ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు. ఈ ఏడాది మొదట్లో వ్యాప్తిచెందిన రకంతో పోలిస్తే.. 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతూ ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఉత్తర ఐర్లండ్‌ మినహా యూకే మొత్తం ఈ కొత్త స్ట్రెయిన్‌ వ్యాపించింది. దీని గుర్తింపు కూడా క్లిష్టంగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. ఈ కొత్త స్ట్రెయిన్‌కు బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ‘వీయూఐ 202012/01’గా పేరు పెట్టారు.

కాగా దీనిపై భార‌త్ అప్ర‌మ‌త్తంగా ఉన్న‌ట్లు తెలిపింది. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. బ్రిటన్ లో వచ్చిన కొత్త స్ట్రెయిన్ వైరస్‌పై ప్రభుత్వం అలర్ట్ గా ఉందని ప్రకటించారు. ప్ర‌జ‌లు అపోహ‌లు, ఊహ‌ల‌తో భ‌య‌ప‌డొద్దండి అన్నారు. ప్ర‌జ‌ల ఆరోగ్యాల దృష్ట్యా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here