ఎన్నిక‌ల కౌంటింగ్ జ‌రుగుతున్న వేళ డొనాల్డ్ ట్రంప్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

అమెరికాలో అధ్యక్ష్య ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. ప్ర‌స్తుతం కౌంటింగ్ జ‌రుగుతోంది. దీంతో ఎవ‌రు గెలుస్తారా అన్న ఉత్కంఠ‌త కొన‌సాగుతోంది. ప‌లు ప్రాంతాల్లో ట్రంప్‌, బైడెన్‌లు ఇద్ద‌రూ ఆదిక్య‌త సాధిస్తున్నారు. దీంతో ఏం జ‌రుగుతుందో అన్న టెన్ష‌న్ ఉంది.

అమెరికా అధ్యక్ష్య ఎన్నిక‌లంటే అమెరికాలోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఓ లుక్ ఉంటుంది. అందుకే ఆ ఎన్నిక‌ల‌కు అంత పాపులారిటీ. ఇప్పుడు అధ్యక్ష్య ఎన్నిక‌ల కౌంటింగ్ జ‌రుగుతుంటే ప్ర‌పంచం మొత్తం అమెరికా గురించే మాట్లాడుకుంటూ ఉంది. ఈ రోజు రాత్రి కంతా అధ్యక్షుడు ఎవ్వ‌రో అన్న దానిపై ఓ క్లారిటీ వ‌స్తుంది. అయితే ఈ లోపు ప‌లు ప్రాంతాల్లో వ‌స్తున్న రిజ‌ల్ట్స్ అంద‌రిలోనూ టెన్ష‌న్ తీసుకొస్తున్నాయి.

ఇక వ‌ర్జీనియా రాష్ట్రంలోని ఎన్నిక‌ల కార్యాల‌యాన్ని డొనాల్డ్ ట్రంప్ సంద‌ర్శించారు. ఆ త‌ర్వాత ట్రంప్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. త‌న ప్ర‌త్య‌ర్థి చేతిలో ఓట‌మి త‌ట్టుకోవ‌డం త‌న‌కు చాలా క‌ష్ట‌మ‌న్నారు. అయితే తాను గెలుపు, ఓట‌ముల గురించి ఏమాత్రం ఆలోచించ‌డం లేద‌ని ట్రంప్ చెప్పారు. త‌న‌కు గెల‌వ‌డం సుల‌భ‌మ‌ని.. ఒట‌మి క‌ష్ట‌మ‌న్నారు. ఈ రెండింటిలో ఏదో ఒక‌టి రావ‌డం ఖాయ‌మ‌న్నారు. ఎన్నిక‌ల కౌంటింగ్‌ను బ‌ట్టి చూస్తే తొంద‌ర‌గానే ఎవ‌రు గెలుస్తార‌న్న‌దానిపై స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని ట్రంప్ చెప్పారు. మొన్న‌టి వ‌ర‌కు గెలుపుపై ధీమా వ్య‌క్తం చేసిన ట్రంప్ ఇప్పుడు మాట్లాడిన మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే ఏదో మార్పు క‌నిపించిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here