బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. దుస్తులు లేకుండా బీచ్‌లో ర‌న్నింగ్‌..

బర్త్‌డే వ‌స్తుందంటే కొంద‌రు డిఫ‌రెంట్‌గా సెల‌బ్రేట్ చేసుకోవ‌డం మ‌న‌కు తెలిసిందే. అయితే ఈయ‌న మాత్రం చాలా డిఫ‌రెంట్‌గా సెల‌బ్రేట్ చేశారు. త‌న ఒంటి మీద నూలి పోగు కూడా లేకుండా ద‌ర్శ‌న‌మిచ్చారు.

ఈయ‌నెవ‌రో కాదు ప్ర‌ముఖ న‌టుడు మిలింద్ సోమ‌న్‌. ఈయ‌న బ‌ర్త్‌డే ఈరోజు. అయితే 55 సంవ‌త్స‌రాలు వ‌చ్చినా తాను చాలా ఫిట్‌గా ఉన్నాన‌ని చెప్ప‌డానికి దుస్తులు లేకుండా క‌నిపించాడు. త‌న ఫిట్ నెస్ ఏంటో చూడాలంటూ బీచ్‌లో ర‌న్నింగ్ చేశాడు. బీచ్‌లో బ‌ట్ట‌లు లేకుండా తిరిగి ఆ వీడియోను ఆయ‌నే పోస్టు చేసి పుట్టిన‌రోజును ఆహ్వానించారు. దుస్తులు లేకుండా ర‌న్నింగ్ చేస్తున్న ఫోటోల‌ను ఆయ‌న భార్య అంకిత కోన్వర్ తీశారు. ఈ విష‌యంలో ఆయ‌న అభిమానులు పాజిటివ్‌గా స్పందిస్తున్నా ఇత‌రులు మాత్రం డిఫ‌రెంట్‌గా కామెంట్స్ చేస్తున్నారు. బ‌ట్ట‌లు ఇస్తాం వేసుకోండి అన్న‌ట్లు మీమ్స్ పెడుతున్నారు. మొత్తానికి ఈయ‌న దుస్తులు లేకుండా బీచ్‌లో ర‌న్నింగ్ చేయ‌డం.. ఆఫోటోలు షేర్ చేయ‌డం వివాదాస్ప‌దంగా మారుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here