మిస్ ఇండియాగా కీర్తి సురేష్ గెలిచిందా..

హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్ర‌లో నటించిన మిస్ ఇండియా సినిమా విడుద‌లైన విష‌యం తెలిసిందే. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కావ‌డంతో కీర్తి న‌ట‌న‌పైనే అంద‌రి దృష్టీ ఉంది. దీంతో ఓటీటీ వేదిక‌గా సినిమా విడుద‌లైన‌ప్ప‌టికీ సినిమాకు మంచి క్రేజ్ వ‌చ్చింది.

డైరెక్ట‌ర్ న‌రేంద్ర‌నాథ్ సినిమాను తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్‌లో మూవీ విడుద‌ల అయ్యింది. ఈ సినిమా వ‌ల్ల కీర్తికి మంచి క్రేజ్ వ‌చ్చింద‌ని చెబుతున్నారు. సినిమా మొత్తం ఆమె మీదే ఉన్న నేప‌థ్యంలో కీర్తి సురేష్‌కు అద‌న‌పు క్రేజ్ తీసుకొచ్చింద‌ని అంతా అనుకుంటున్నారు. సినిమా పేరుకి సినిమాకు ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్న ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంటోంది. ఓ సాదార‌ణ అమ్మాయి వ్యాపార రంగంలో ఏ విధంగా ఎదిగింద‌న్న‌ది సినిమాలో చూపించారు. ఇప్ప‌టికే జాతీయ ఉత్త‌మ న‌టి పుర‌స్కారం అందుకున్నారు కీర్తి సురేష్‌. ఈ సినిమాతో ఆమె మ‌రోసారి త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకున్నారు.

ఈ సినిమాతో కీర్తి ఓటీటీలో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొత్తానికి మిస్ ఇండియాగా కీర్తి సురేష్ గెలిచార‌ని అనుకోవ‌చ్చు. కాగా త్వ‌ర‌లోనే సినిమా థియేట‌ర్లు దేశ వ్యాప్తంగా తెరుచుకుంటాయ‌ని అనుకుంటున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ఓటీటీలో మంచి పేరు తెచ్చుకున్న కీర్తికి అవ‌కాశాలు మ‌రింత‌గా పెరుగుతాయ‌ని ఇండ‌స్ట్రీ టాక్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here