వాట్స‌ప్ స్టేట‌స్ పెట్ట‌డం వ‌ల్ల ఇలా జ‌రుగుతుందా..

అప్పుడ‌ప్పుడు ఏం జ‌రిగినా మ‌న మంచికే అంటుంటారు కొంద‌రు. అయితే ఏం జ‌రిగినా మ‌న మంచికే కాదు చెడుకి కూడా అవుతుంద‌ని తాజాగా ప్రూవ్ అయ్యింది. వాట్సాప్ స్టేట‌స్ పెట్టుకోవ‌డం వ‌ల్ల ఓ మ‌హిళ పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సి వ‌చ్చింది.

విష‌యం ఏమిటంటే.. హైద‌రాబాద్‌లోని డ పోలీస్ స్టేషన్ పరిథిలోని సాయిపురి కాలనీలో నివాసం ఉంటున్న ర‌వికిర‌ణ్ ఇంట్లో ఏడాదిర‌న్న‌ర క్రితం చోరీ జ‌రిగింది. ర‌వి ఆల‌యానికి వెళ్లి వ‌చ్చే స‌రికి ఇంట్లో చోరీ జ‌రిగింది. అయితే ఇది గ‌మనించ‌ని అత‌ను త‌లుపులు వేయ‌డం మ‌ర్చిపోయానేమో అనుకున్నారు. తీరా ఇంట్లో బంగారు న‌గ‌లు లేక‌పోవ‌డంతో దొంగ‌త‌నం జ‌రిగింద‌ని నిర్దారించుకున్నాడు. వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ కేసు 15 నెల‌ల నుంచి ఇంకా దర్యాప్తు జ‌రుగుతూనే ఉంది.

అయితే ఇటీవ‌ల త‌న ప‌క్కింట్లో ఉండే మ‌హిళ వాట్సాప్ స్టేట‌స్ పెట్టుకుంది. ఆ స్టేటస్‌లో పెట్టిన ఫోటోలో ఆమె వేసుకున్న నగ‌లు చూస్తే ర‌వికిర‌ణ్‌కు అనుమానం క‌లిగింది. ఆ న‌గ‌లు త‌మ‌వేన‌ని పోలీసుల‌కు స‌మాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు త‌మ స్టైల్లో విచారించ‌గా విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ప‌క్కింటి మ‌హిళ కుమారుడు జితేంద‌ర్ న‌గ‌లు దొంగిలించార‌ని విచార‌ణ‌లో తేలింది. అయితే విష‌యం జితేంద‌ర్ త‌ల్లికి తెలుసో తెలియ‌దో అన్న‌ది తెలియ‌దు. జితేంద‌ర్ త‌ల్లికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. 2019 జూలై 12న చోరీ కేసు వాట్సాప్ స్టేట‌స్ ద్వారా ఇప్పుడు క్లియ‌ర్ అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here