"రాజ్ తరుణ్ అసలేమనుకుంటున్నాడు ? పెద్ద స్టార్ హీరో నా ?" అంటారు

సినిమా విడుదల కి ముందర రోజు రాత్రే ప్రీమియర్ లు వెయ్యడం పరిపాటి గా మార్చుకుంటున్నారు కొందరు హీరోలు , నిర్మాతలు  . పెద్ద హీరోల వరకే పరిమితమయిన ఈ పిచ్చి నెమ్మది నెమ్మదిగా చిన్న హీరోలకి కూడా పాకుతోంది. చివరకి రాజ్ తరుణ్ సినిమా కి కూడా పైడ్ ప్రీమియర్ లు వేసేవరకూ వచ్చేసింది వ్యవహారం. పైడ్ ప్రీమియర్ లు ప్లాన్ చెయ్యడం నిర్మాతల కాన్ఫిడెన్స్ ని చూపిస్తూ ఉన్నా జనం అంతగా కేర్ చేస్తారా అనేది చాలా పెద్ద ప్రశ్న. సినిమా బాగున్నది అని టాక్ ఒస్తే పర్లేదు కానీ నెగెటివ్ గా వస్తే మాత్రం చాలా నేగేటివిటి స్ప్రెడ్ అయిపోతుంది.
అసలు రాజ్ తరుణ్ లాంటి హీరోకి ప్రీమియర్ లు ఏంటి అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అందగాడు సినిమా సూపర్ డూపర్ అవుట్ పుట్ తో ఉంటె కానీ ఈ పైడ్ ప్రీమియర్ ల వలన ఉపయోగం ఉండదు. పైగా కాస్తంత తేడా వచ్చి సినిమా టాక్ డివైడ్ అయితే హీరో కి ఒళ్ళు పొగరు అనుకుంటారు .. పెద్ద స్టార్ అయ్యాడని ఈడి ఫీలింగ్ రా అనుకుంటారు. సో ఎటు చూసుకున్నా ఇది పెద్ద రిస్క్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here