డాక్ట‌ర్‌ని ప్ర‌భుదేవా ఎందుకు పెళ్లి చేసుకున్నారో తెలుసా..

ప్ర‌ముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫ‌ర్ ప్ర‌భుదేవా గురించి కొన్ని రోజులుగా ప‌లు వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఆయ‌న రెండో పెళ్లి చేసుకున్నార‌న్న దానిపై ప‌లు ర‌కాల విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. తాజాగా దీనిపై క్లారిటీ వ‌చ్చింది. ప్రభుదేవా ఓ డాక్ట‌ర్‌ని రెండో పెళ్లిచేసుకున్నారు.

ప్ర‌భుదేవా 1995లో రామ‌ల‌త‌ను వివాహం చేసుకున్నారు. అయితే ప‌లు కార‌ణాల వ‌ల్ల 16 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఇద్ద‌రూ విడిపోయారు. తాజాగా కొన్ని రోజులుగా ప్ర‌భుదేవా రెండో పెళ్లికి సంబంధించిన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే అవ‌న్ని నిజ‌మే అని ప్ర‌భుదేవా సోద‌రుడు చెప్పారు. ముంబైలో డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న హిమ‌నిని ప్ర‌భు పెళ్లి చేసుకున్నారు. డ్యాన్స్ చేస్తున్న క్ర‌మంలో ప్ర‌భుదేవాకు ప‌లు స్వ‌ల్ప గాయాలు అవుతున్న స‌మ‌యంలో డాక్ట‌ర్ హిమ‌ని ట్రీట్ మెంట్ ఇచ్చేవారు. ఈ క్ర‌మంలో వీరి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింది. మే నెల‌లో వీరిద్ద‌రి పెళ్లి అత్యంత స‌న్నిహిత కుటుంబ స‌భ్యుల మ‌ధ్య జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. కాగా ప్ర‌భుదేవా రెండో పెళ్లి చేసుకున్న విష‌యంలో ఆయ‌న కుటుంబం సంతోషం వ్య‌క్తం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here