ప‌వ‌ర్ స్టార్‌, రానా ఇద్ద‌రూ క‌లిసి సినిమా ఎందుకు చేస్తున్నారో తెలుసా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా అంటేనే ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇక ద‌గ్గుబాటి రానా గురించి మ‌నం ఏమాత్రం మాట్లాడుకోవ‌డానికి లేదు. ఈ ఇద్ద‌రి సినిమాలు వ‌స్తున్నాయంటే అభిమానుల‌కు పండుగే. అదే ఇద్ద‌రూ ఒకే సినిమాలో న‌టిస్తున్నారంటే ఇంకా ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రానా ఇద్ద‌రూ క‌లిసి ఓ సినిమా చేస్తున్నార‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చి మళ్లీ వెండితెరపై మెరవబోతున్నారు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న `వకీల్ సాబ్`లో నటిస్తున్నారు. అలాగే డైరెక్టర్ క్రిష్ రూపొందించనున్న సినిమాను కూడా త్వరలోనే పట్టాలెక్కించబోతున్నారు. తాజాగా మరో సినిమా ప్రకటన బయటకు వచ్చింది. మ‌లయాళంలో విజయవంతమైన `అయ్యప్పనుమ్ కోషియమ్`‌ను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ తెలుగులోకి రీమేక్ చేస్తోంది. సాగర్ కె. చంద్ర ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో పవన్‌తోపాటు దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్నాడు. దానికి సంబంధించిన అప్‌డేట్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఇద్ద‌రు స్టార్ హీరోలు ఈ సినిమాలో ఉండ‌టంతో అభిమానుల అంచనాలు భారీగా ఉండ‌నున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here