కొత్త పార్ల‌మెంటు భ‌వ‌నానికి విద్యార్థి విరాళం ఇస్తే లోక్‌స‌భ స్పీక‌ర్ ఏం చేశారో తెలుసా..

దేశంలో పార్ల‌మెంటు అంటే ఎంతో ఉన్న‌త‌మైన‌దిగా భావిస్తాము. అలాంటిది ఇప్పుడు నూత‌న పార్ల‌మెంటు భ‌వ‌నం నిర్మించాల‌ని ప్ర‌భుత్వం భావించింది. ఇందుకోసం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సైతం శంకుస్థాప‌న చేశారు. అద్బుతంగా ఈ భ‌వ‌నాన్ని నిర్మించ‌బోతున్నారు. దేశం మొత్తం ఈ పార్ల‌మెంటు భ‌వ‌నం గురించి చ‌ర్చించుకుంటూ ఉంది.

నూత‌న పార్ల‌మెంటు భ‌వ‌నానికి ఓ విద్యార్థి విరాళం ఇవ్వ‌డం ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. మదురైలో ఈనెల 11న పుట్టినరోజు జరుపుకున్న సాయిఅక్షయ్‌ప్రణవ్‌, తాను పొదుపుచేసిన రూ.1,145ను కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి విరాళంగా పంపించారు. ఆ విద్యార్థి మాట్లాడుతూ చెన్నైలోని రాజాజీ విద్యాశ్రమంలో 6వ తరగతి చదువుతున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా మదురైలోని బంధువుల ఇంటికి వచ్చి ఆన్‌లైన్‌ తరగతు లకు హాజరవుతున్నానని చెప్పాడు. అయితే పుట్టినరోజు సందర్భంగా ఏదైనా మంచిపని చేయాలని భావించి, తాను పొదుపు చేసిన నగదు కొత్త పార్లమెంటు భవన నిర్మాణా నికి విరాళంగా పంపానన్నారు.

అయితే ఆ విద్యార్థి విరాళం పంప‌డం ప‌ట్ల లోక్ స‌భ స్పీక‌ర్ అభినందించార‌ని చెప్పాడు. విరాళాన్ని తిరిగి విద్యార్థికి పంపించిన‌ట్లు తెలిపారు. అయితే నా విరాళాన్ని స్వీకరించాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరినట్లు విద్యార్థి తెలిపాడు. ఓ విద్యార్థి పార్ల‌మెంటు భ‌వ‌నానికి విరాళం ఇవ్వడానికి ముందుకు రావ‌డం ప‌ట్ల విష‌యం తెలిసిన వారంతా అభినందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here