ఆ రోజు ప్ర‌ధాని మోదీ ధ్యానం చేసిన స్థ‌లం నేడు ఎలా ఉందో తెలుసా..

దేశ ప్ర‌ధానిగా న‌రేంద్ర మోదీ అధికారం చేప‌ట్టిన త‌ర్వాత ఆయ‌న త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్నారు. సొంత దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఇప్పుడు మోదీ పేరు చెబితే ఆయ‌నో గొప్ప వ్య‌క్తి అనే ప‌రిస్థితికి తీసుకొచ్చారు. ఇందుకు కార‌ణం ఆయ‌న అవ‌లంబిస్తున్న విధానాలే అని చెప్ప‌క‌నే చెప్పొచ్చు.

ఇప్పుడు మోదీ ఏం చేసినా ఓ ట్రెండే అనే విధంగా మారింది. ఇందుకు నిద‌ర్శ‌న‌మే ఆయ‌న ధ్యానం చేసిన స్థంలో మ‌రో మూడు ధ్యాన గుహ‌లు ఏర్పాటుచేయ‌నుండ‌టం. అవును ఇది నిజ‌మే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కేదార్‌నాథ్ మందిరాన్ని సంద‌ర్శించిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆగుహ‌కు బాగా డిమాండ్ పెరిగింది. దీంతో ప్ర‌భుత్వం దీనిపై దృష్టి పెట్టింది. మోదీ గుహలో ధ్యానం చేశాక ఈ గుహకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం లభించింది. ప్రభుత్వం నిర్మించిన మూడు ధ్యాన గుహలను నిర్వహణ కోసం గర్హ్వాల్ వికాస్ నిగంకు అప్పగిస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది.

ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓంప్రకాష్ కేదార్ నాథ్, బద్రీనాథ్ అభివృద్ధి పనులను సమీక్షించారు. వచ్చే వందేళ్లకు వీలుగా బద్రీనాథ్ ధామ్ కోసం మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని మోదీ ఉత్తరాఖండ్ సర్కారును కోరారు. దీంో 85 హెక్టార్ల విస్తీర్ణంలో బద్రీనాథ్ అభివృద్ధి ప్రణాళికను అమలు చేయాలని నిర్నయించారు.కేదార్ నాథ్ హెలిప్యాడ్ వద్ద 50 దుకాణాలను కూడా నిర్మించారు. ఈ నిర్ణ‌యాన్ని చాలా మంది స్థానికులు స్వాగ‌తిస్తున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంద‌ని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మోదీ ఒక్కసారి ఇలా వచ్చి అలా వెళ్లినందుకే ఇలా చేయడం గొప్ప విష‌య‌మేమ‌రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here