హిందూవుల‌కు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపిన పాకిస్తాన్ ప్ర‌ధానిపై నెటిజ‌న్లు ఏం చేశారో తెలుసా..

దీపావ‌ళి పండుగ‌ను భార‌తీయులు ఎంతో ప‌విత్రంగా జ‌రుపుకుంటారు. అందుకే ఈ పండుగ‌కు దేశంలోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భార‌తీయులంద‌రికీ ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు వ‌స్తుంటాయి. ఇత‌ర దేశాల‌కు చెందిన అధ్యక్షులు కూడా వారి దేశాల్లో ఉన్న భార‌తీయుల‌కు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు చెప్పారు.

ఇక పాకిస్తాన్ ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా హిందూవుల‌కు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు చెప్పారు. ఇది సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయ్యింది. అయితే నెటిజ‌న్లు ఇమ్రాన్‌పై తీవ్రంగా మండిప‌డ్డారు. పాకిస్తాన్‌లో ఇంకా హిందూవులు మిగిలారా అంటూ కామెంట్లు పెట్టారు. అందరూ ఇప్పటికే మతమార్పిడి చేయించుకున్నారని అనుకుంటున్నాను అంటూ మ‌రో వ్య‌క్తి స్పందించారు. ఇమ్రాన్ పెట్టిన ట్వీట్‌లో ఎన్ని అక్ష‌రాలు ఉంటే పాక్‌లో హిందూవులు కూడా అంత మందే ఉంటార‌ని ఇంకో వ్య‌క్తి ట్వీట్ చేశారు.

పాకిస్థాన్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులు, క్రిస్టియన్లపై నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని దాడులు జ‌రుగుతున్నా ప్రభుత్వం మాత్రం ఏం చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌న్న వాద‌న ఉంది. పాకిస్థాన్‌లో గతేడాది అత్యాచారానికి గురైన ఓ హిందూ యువతి అక్టోబర్ ఒకటో తేదీన ఆత్మహత్య చేసుకుంది. నిందితుడు బెయిల్‌పై బయటకు వచ్చి ఆమెను బెదిరిస్తుండటంతో యువతి బలవన్మరణానికి పాల్పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here