ప‌వ‌న్‌ని చూడ‌గానే అభిమానులు ఏం చేశారో తెలుసా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు పూర్తిగా సినిమాలు చేసేందుకు ఓకే చెప్పేశారు. దీంతో డైరెక్ట‌ర్లు సినిమాలు తీసేందుకు ఆయ‌న వెంట ప‌డుతున్నారు. ప‌వ‌న్ సినిమా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానుల‌కు పండ‌గే.

తాజాగా ఆయ‌న వ‌కీల్‌సాబ్ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. షూటింగ్ వేగంగా జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఆయ‌న షూటింగ్‌కు సంబంధించిన స‌మాచారం మాత్రం ఎవ్వ‌రికీ తెలియ‌దు. కానీ ఏమైందో ఏమో ఉన్న‌ట్టుండి ప‌వ‌ర్ స్టార్ షూటింగ్ పిక్స్ సోష‌ల్ మీడియాలోకి వ‌చ్చేశాయి. వ‌కీల్‌సాబ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తాజాగా నిజాం కళాశాలలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. అక్కడ లోకేషన్‌లో తీసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిజాం కళాశాలలో పవన్ ఉన్నట్టు తెలుసుకున్న అభిమానులు భారీగా అక్కడకు చేరుకున్నారు. దీంతో వారందరికీ అభివాదం చేసిన పవన్ కొందరితో ఫొటోలు కూడా దిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here