ఢిల్లీలో ఉగ్ర‌వాదులు ఏం చేస్తున్నారో తెలుసా..

దేశంలో అల‌జ‌డి సృష్టించేందుకు ఉగ్ర‌వాదులు ఎప్పుడు ఏదో ఒక చోట ప్లాన్ చేస్తూనే ఉంటారు. ఇప్ప‌టికే ప‌లువురిని భ‌ద్ర‌తా ద‌ళాలు ప‌ట్టుకుంటున్నాయి. బుధ‌వారం ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు మరణించారు. దేశరాజధాని నగరమైన ఢిల్లీలోని షకర్పూర్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఐదుగురు ఉగ్రవాదులను ఢిల్లీ ప్రత్యేక సెల్ పోలీసులు అరెస్టు చేశారు.

జమ్మూకశ్మీరుకు చెందిన ముగ్గురు, పంజాబ్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారనేది ఇంకా నిర్ధారించలేదు. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో ఉగ్రదాడికి వ్యూహం పన్నిన ఇద్దరు జైషే మహ్మద్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను 20 రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదుల నుంచి రెండు సెమీ ఆటోమేటిక్ పిస్టళ్లు, 10లైవ్ కాట్రిడ్జులను స్వాధీనం చేసుకున్నారు. వీరి అరెస్టుతో దేశ రాజధాని నగరంలో ఉగ్రదాడి కుట్రను పోలీసులు విఫలం చేశారు.

జమ్మూకశ్మీరులోని పుల్వామా జిల్లా టికెన్ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటరులో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు మరణించారు. పుల్వామాలోని టికెన్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు సాయుధ బలగాలతో కలిసి బుధవారం తెల్లవారుజామున గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు మరణించారని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు.పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. మరణించిన ఉగ్రవాదులు ఎవరనేది గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here