షూటింగ్ మ‌ధ్య‌లో శృతిహాస‌న్ వెళ్లిపోవ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా..

హీరోయిన్ శృతిహాసన్ టాలెంట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నార‌ని తెలుసు. క‌మ‌ల‌హాస‌న్ కూతురిగానే కాకుండా ఆమెకు ప్ర‌త్యేక‌మైన స్టైల్ ఉంది. తెలుగు, త‌మిళ సినిమాలతో ఆమె ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా షూటింగ్‌లో శృతిహాస‌న్ చేసిన ప‌ని ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

లాభం అనే తమిళ సినిమాలో శృతిన‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ధ‌ర్మ‌పురి, కృష్ణ‌గిరి ప్రాంతాల్లో జ‌రిగింది. అయితే హీరోయిన్ శృతిహాస‌న్ సినిమా షూటింగ్‌కు వ‌చ్చార‌ని తెలుసుకున్న చుట్టుప్ర‌క్క‌ల ప్రాంతాల ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో ఆమెను చూడ‌టానికి లొకేష‌న్‌కి వ‌చ్చారంట‌. దీంతో శృతి మ‌ధ్య‌లోనే షూటింగ్ నుంచి వెళ్ల‌పోయార‌ని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై స‌ర్వ‌త్రా చ‌ర్చ న‌డుస్తోంది. శృతి షూటింగ్ మ‌ధ్య‌లో ఇలా వెళ్లిపోవ‌డం ఏంట‌ని కొంద‌రు అనుకుంటుంటే.. మ‌రికొంద‌రు మాత్రం క‌రోనా కార‌ణంగా ఆమె ఇలా నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు. శృతి క‌రోనా విష‌యంలో చాలా సీరియ‌స్‌గా ఉన్నారు. గుంపులు గుంపులుగా ఉండ‌టం మంచిది కాద‌ని అంటున్నారు. ఏదేమైనా షూటింగ్ జ‌రుగుతున్న వేళ శృతిహాస‌న్ తీసుకున్న నిర్ణ‌యం వైర‌ల్ అవుతోంది. లాభం సినిమాలో విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. సినిమాకు ఎస్పీ జ‌న‌నాథ‌న్ డైరెక్ష‌న్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here