జ‌గ‌న్ చ‌ప్ప‌ట్ల వెనుక అర్థ‌మేంటో తెలుసా..

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డి మ‌రోసారి పెద్ద మ‌న‌సు చాటుకున్నారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌, వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చి చ‌రిత్ర సృష్టించారు జ‌గ‌న్‌. ఇప్పుడు వారి కోసం చ‌ప్ప‌ట్లు కొట్టి శ‌భాష్ అనిపించుకున్నారు.

గ‌తేడాది వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌తో పాటు గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలను జ‌గ‌న్‌ ప్రారంభించారు. దీంతో ఏడాది పూర్తి చేసుకున్న సంద‌ర్బంగా సీఎం జ‌గ‌న్ చ‌ప్ప‌ట్లు కొట్టారు. తాడేప‌ల్లిలోని ఆయ‌న నివాసం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌గ‌న్ స‌రిగ్గా 7 గంట‌ల‌కు చ‌ప్ప‌ట్లు కొట్టి సంఘీభావం ప్ర‌క‌టించారు. దేశం త‌న‌వైపు చూసేలా జ‌గ‌న్ అభివృద్ధి చేస్తున్నారు. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు. ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల వీడియో కాన్ఫ‌రెన్సులో సీఎం జ‌గ‌న్ చేస్తున్న అభివృద్ధిని ప్రధాని కొనియాడిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం జ‌గ‌న్ చేప‌ట్టిన ఈ చ‌ప్ప‌ట్ల కార్య‌క్ర‌మం వ‌ల్ల ఉద్యోగుల్లో మ‌రింత ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంద‌ని ప్ర‌జ‌లు చెబుతున్నారు.

జ‌గ‌న్ తీసుకొచ్చిన స‌చివాల‌య‌, వాలంటీర్ల వ్య‌వ‌స్థ ద్వారా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే ప్ర‌భుత్వాలు వ‌చ్చిన‌ట్లు అయ్యింది. గ్రామాల్లో ఏ చిన్న ప‌ని కావాలన్నా ప్ర‌జ‌లు క్ష‌ణాల్లో ప‌నులు చేసుకునేలా వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటుచేశారు. దేశంలో దిగ్గ‌జ రాజ‌కీయ నాయ‌కులు చేయ‌లేని ప‌నిని సీఎం జ‌గ‌న్ చేసి చూపించార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో డిస్క‌ష‌న్ న‌డుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here