కాజల్‌ ఆ సీన్లకు ఓకే చెప్తుందా.?

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా క్వాంటికో అనే ఇంటర్నేషనల్‌ వెబ్‌ సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌తోనే ప్రియాంకాకు హాలీవుడ్‌లో మంచి పేరు వచ్చింది. ఇందులో ప్రియాంక హాట్‌ హాట్‌గా నటించి ప్రపంచవ్యాప్తంగా గ్లామర్‌ డాల్‌గా పేరు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సిరీస్‌ను భారత్‌లో రీమేక్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇండియాలోని అన్ని భాషల్లో ఈ వెబ్‌ సిరీస్‌ను రీమేక్‌ చేయనున్నట్లు సమాచారం.

అయితే దాదాపు అన్ని భాషల్లో నటించిన కాజల్‌ అగర్వాల్‌ నటిస్తే ఈ సిరీస్‌కు ప్లస్‌ అవుతుందని భావించిన సదరు దర్శకనిర్మాతలు ఇందుకోసం కాజల్‌ను సంప్రదించారని సమాచారం. దీనికి కాజల్‌ కూడా ఓకే చెప్పిందట. అయితే అంతా బాగానే ఉంది కానీ.. క్వాంటికో సిరీస్‌లో ప్రియాంక చోప్రా పోషించిన హాట్‌ సీన్లలో కాజల్‌ నటిస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా కార్‌, బెడ్‌ రూమ్‌, బాత్‌ రూమ్‌లలో వచ్చే కొన్ని హాట్‌ సన్నివేశాలకు కాజల్‌ అగర్వాల్‌ ఓకే చెప్తుందా? అని సందేహిస్తున్నారు. మరి ప్రియాంక పాత్రలో కాజల్‌ ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here