ద‌ళితుడు అన్నంతో ఉన్న ప్లేట్ ముట్టుకున్నందుకు ఎంత ప‌ని చేశారో తెలుసా..

మ‌నం సినిమాల్లో చూస్తూ ఉంటాం. కులం, మ‌తం తేడాలు చూపిస్తూ ఎలా ప్ర‌వ‌ర్తిస్తుంటారో అని. కానీ నిజ జీవితంలో కూడా ఇంకా ద‌ళితులు అణ‌చివేత‌కు గుర‌వుతూనే ఉన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న దేశం మొత్తం చ‌ర్చ‌కు దారితీస్తోంది.

ఛతర్‌పూర్ జిల్లాలో కిషాన్‌పూర్ గ్రామంలో డిసెంబరు 7న ముగ్గురు యువకులు పార్టీ చేసుకున్నారు. వీరిలో దళిత యువకుడు దేవరాజ్ అనురాగీ ఉన్నాడు. అతను పార్టీ కోసం తెచ్చిన ఆహారాన్ని ముందుగా ముట్టుకున్నాడు. ఈ విషయం ఆ ప్రాంతంలోని అగ్రవర్ణాల వారికి తెలిసింది. దీంతో వారు ముందుగా ఆ దళిత యువకుడిని బెదిరించారు. తరువాత ఆ ఇద్దరు యువకులు అ దళిత యువకుడిని కర్రతో చావబాదారు. ఫలితంగా అతను స్పృహతప్పి పడిపోయాడు. తరువాత ఆ యువకుడిని అతని ఇంటి దగ్గర వదిలేసి, ఆ ఇద్దరు యువకులు అక్కడి నుంచి పారిపోయారు. ఇంతలో గాయాలపాలైన ఆ దళిత యువకుడు ప్రాణాలొదిలాడు.

ఈ ఉదంతం గురించి ఛతర్‌పూర్ ఎఎస్పీ సమీర్ సౌరభ్ మాట్లాడుతూ ఈ ఉదంతం డిసెంబరు 7న జరిగిందని, కిషాన్‌పూర్ గ్రామంలో మతిస్థిమితం లేని దళిత యువకుడు దేవరాజ్ అనురాగీని… సోనీ, పాల్‌లు ఆహారం తినేందుకు పిలిచారని, రెండు గంటల తరువాత ఆ యువకుడిని అతని ఇంటిలో వదలివేశారన్నారు. తనను ఆ ఇద్దరు యువకులు కొట్టారని అనురాగీ తన కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారి ఆహారం ముట్టుకున్నందుకు కొట్టారని అనురాగీ ఆరోపించాడన్నారు. త్వరలోనే నిందింతులను పట్టుకుంటామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here