బీజేపీ జాతీయ అధ్య‌క్షుడి కారుపై దాడి ఘ‌ట‌న‌లో ఎన్ని కేసులు న‌మోదు చేశారో తెలుసా..

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న కారుపై రాళ్ల‌దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రిగింది. ప‌శ్చిమ బెంగాల్‌లో ఈ విష‌యం తీవ్ర దుమారం రేగింది. అయితే ఈ విష‌యంలో గ‌వ‌ర్న‌ర్ కూడా కేంద్రానికి లేఖ రాశారు.

ఈ దాడికి సంబంధించి మూడు ఎఫ్‌ఐఆర్లను నమోదు చేయడంతో పాటు ఏడుగురిని అరెస్ట్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారంటూ రెండు సుమోటో ఎఫ్‌ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు. మూడో ఎఫ్‌ఐఆర్ మాత్రం బీజేపీ నేత రాకేశ్ సింగ్‌పై నమోదు చేయడం గమనించదగ్గ అంశం. దగ్గర్లో ఉన్న గుంపులను రెచ్చగొట్టినందుకు గాను ఆయనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు.

పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్ కు వెళ్తుండగా టీఎంసీ కార్యకర్తలు నడ్డా కాన్వాయ్ పై రాళ్లతో దాడి చేశారు. అయితే ఈ దాడిని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. పశ్చిమ బెంగాల్ లో నెలకొన్న శాంతిభద్రతల సమస్యపై తక్షణమే నివేదికను సమర్పించాలని గవర్నర్ ధన్కర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కోరారు. ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్ ఆయ‌న చేయాల్సిందంతా చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here