బాహుబలి మూడు రోజుల్లో ఐదొందల కోట్లు ఎలా వసూలు చేసిందో తెలుసా ?

ఇంతవరకూ భారతీయ సినిమా ఎప్పుడూ సాధించని అతిగొప్ప విజయాన్ని , కలక్షన్ లనీ బాహుబలి చిత్రం సొంతం చేసుకుంటోంది. విడుదల కి ముందర నుంచే వచ్చిన విపరీతమైన క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్న బాహుబలి చిత్రం అద్భుతమైన కలక్షన్ లతో సాగుతోంది. ఈ సినిమా నిర్మాతలు సైతం పక్కా ప్లానింగ్ తో వెళుతూ ఉండగా బాహుబలి 2 కి కలక్షన్ ల వర్షం కురుస్తోంది. సినిమా విడుదల కి మే డే కూడా సూపర్ గా కలిసి రావడం ఇక్కడ అతిపెద్ద పాజిటివ్ పాయింట్. వేసవి శలవలు కావడం పిల్లలకి స్కూల్ శలవలు ఉండడం తో సాయంత్రం అవ్వగానే బాహుబలి మీద పడుతున్నారు ఫామిలీ లు మొత్తం.

ఇక వీకెండ్ కావడంతో వేతన జీవులు కూడా ‘బాహుబలి-2: ద కన్ క్లూజన్’ ఒడిలోనే సేదదీరారు. దీంతో ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే 505 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి, రికార్డులకెక్కింది. మే డే కూడా కలిసి రావడం తో విడుదల అన్ని భాషల్లో కలిపి కేవలం దేశం లో మూడొందల ఎనభై కోట్లు వసూలు చేసింది. విదేశాల్లో నూట ఇరవై కోట్లు వచ్చింది. ఇదే కంటిన్యూ అయితే 1000 కోట్ల రూపాయలు వసూలు చేసిన తొలి భారతీయ సినిమాగా రికార్డులు నెలకొల్పుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here