అన్న‌దానం మాదిరిగా బంగారం దానం చేస్తున్న హీరో ఎవ‌రో తెలుసా..

ఇండ‌స్ట్రీ అన‌గానే ఎంతో మంది హీరోలు గుర్తొస్తుంటారు. అయితే వారిలో చాలా త‌క్కువ మంది నిజ జీవితంలో కూడా హీరోలాగే అభిమానుల్ని సంపాదించుకుంటారు. ఇప్పుడు ఓ హీరో మూవీ యూనిట్ స‌భ్యుల‌కు బంగారం పంచిపెట్టి నిజంగా హీరో అయిపోయాడు.

ఆయ‌నెవ‌రో కాదు త‌మిళ హీరో శింబు. ఆయ‌న న‌టించిన ఈశ్వ‌ర‌న్ చిత్రం ఇటీవ‌ల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సుశీంద్ర‌న్ డైరెక్ష‌న్ చేస్తున్నారు. దీపావ‌ళికి సినిమా టీజ‌న్‌ను విడుద‌ల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా కోసం శింబు 30 కిలోల బ‌రువు తగ్గిన‌ట్లు తెలుస్తోంది. సినిమాలో ఆయ‌న కొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నారు.

స‌రే ఇదంతా ఒకెత్త‌యితే శింబు యూనిట్‌లో సభ్యులందరికీ అంటే దాదాపు 400 మందికి 1 గ్రాము బంగారం, జత బట్టలను కానుకగా ఇచ్చాడు. మరో 200 మంది జూనియర్‌ ఆర్టిస్టులకు జత బట్టలను గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీంతో అందరూ ఆ హీరోను అభినందిస్తున్నారు. ఈయన సినిమా పూర్త‌యిన సంద‌ర్బంగా ఆయ‌న ఇలా అంద‌రికీ సంతోషంగా పంచిపెట్టారు. యూనిట్‌ సభ్యులకు బంగారంను బహుమతిగా ఇచ్చి తన పెద్ద మనసుని చాటుకున్నాడు. దీంతో యూనిట్ మొత్తం సంతోంషంలో మునిగిపోయారు. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here